మల్కాజిగిరి, మే 13 : ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మౌలాలి, నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధురానగర్‌లోని డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్‌లో ఓల్టేజ్, విద్యుత్ దీపాల సమస్యలు పరిష్కరించాలన్నారు. స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, ఓపెన్ జిమ్, చిల్డన్స్ ప్లే ఏరియాలో పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పక్కకు జరిపి ఎత్తు పెంచాలన్నారు.
మారుతీనగర్‌లో ఆధునిక డ్రైనేజీ, సీసీరోడ్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వరద నీరు ప్రవహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, డీఈ మహేశ్, ఏఈ సృజన, జలమండలి డీజీఎం రాజు ఏఈ నవీన్, ఎలక్ట్రికల్ ఏఈ లక్ష్మి, స్ట్రీట్ లైట్స్ ఏఈ వెంకటేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల అంజయ్య, మల్కాజిగిరి సర్కిల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకన్న, జీకే హనుమంతరావు, శివ కుమార్, మధుసూదన్ రెడ్డి, శ్రీను, శంకర్, సాయి గౌడ్, సుమన్ గౌడ్, సుధీర్, రాజు, అవినాశ్, నవీన్, వినీత్, సందీప్, శోభ, మధుర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రవీంద్ర, దేవరాజ్, సూర్యనారాయణ, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, మనోజ్, వినీత్, నాగభూషణం కిరీట్ రెడ్డి, అమీనుద్దీన్ సత్యనారాయణ, భాగ్యనంద్, ఉస్మాన్, శైలేందర్, మారుతి ప్రసాద్, సంతోష్ గుప్తా, దినేశ్, మహేశ్, రాజశేఖర్ రెడ్డి, వంశీ, నవాబు, నర్సింగరావు, ఈస్ట్ మారుతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి మాధవాచారి, సాయికుమార్, కోటేశ్వరరావు నర్సింగ్ రావు ప్రసాద్, సయ్యద్, రామకృష్ణ, రెహమాన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.