మల్కాజిగిరి, నవంబర్ 7: ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగవారం మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మౌలాలి, గౌతంనగర్ డివిజన్లలో ఆయన పాదయాత్రచేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే.. మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్‌బాగ్‌లోని బృందావన్ గార్డెన్లో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వారికి స్వయం ఉపాధి, విదేశీ విద్య, దూప దీప నైవేథ్య పథకం అమలుపరుస్తున్నామని అన్నారు. అర్హులైన వారికి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఇప్పటి కే సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిబాటలో నడిపి స్తున్నారని అన్నారు. ప్రజలకు సేవచేయకుండా స్వార్థంతో కాలయాపన చేసిన ఎమ్మెల్యేను ఇంటికి పంపాలని అన్నా రు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపనులతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుపరుస్తుండ డంతో వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేర డం హర్షణీయమని, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని అ న్నారు. ప్రజలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయవద్దని అన్నారు. ఈ కార్యమ్రమంలో బ్రాహ్మణ పరిషత్ నాయకు లు సుమలతశర్మ, సుధాకర్ శర్మ, నాగేశ్వరసిద్ధాంతి, శ్రీకాంత్, శికా, ప్రభాకర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు జగదీ ష్‌గౌడ్, ఆకుల నర్సింగరావు, నాయకులు బద్దం మహ్మద్ అమీనుద్దీన్, సంతోష్నాయుడు, గణేశ్, యాదగిరి, సాబీర్, నవాబ్, సాయి, సిద్ధిక్, ఫరీద్, నాగకుమారి, విజయకుమారి, వైశాలి పాల్గొన్నారు.