నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
తులం బంగారం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడాది దాటినా..ఇవ్వడం లేదని మండిపడ్డారు. చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు పోరాట చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.