సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మిచౌంగ్ తుఫాన్ వల్ల మధురై -నిజాముద్దీన్, తిరుచిరాపల్లి- హౌరా, విశాఖపట్నం- తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న రైళ్లను ఈ నెల 4, 5 తేదీలలో రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
‘మిచౌంగ్’ తుఫాన్ వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎస్సీఆర్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు.