సైదాబాద్, డిసెంబర్ 27: మాయమాటలతో ఓ బాలికపై లైంగిక దాడి చేసి పెండ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డ్డ నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చించిందని సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.రాఘవేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సైదాబాద్ హరిజనబస్తీలో నివాసముండే అమిందాల భార్గవ్కుమార్(36) అలియాస్ చింటూ, భార్గవ్ ఓలా బైక్ డ్రైవర్గా పనిచేస్తుండగా, అతడికి భార్య, కుమారుడు ఉన్నాడు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో భార్గవ్కుమార్పై సైదాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అప్పటి ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ విచారణను వేగవంతంగా కొనసాగించారు. పోక్సో కేసును విచారించిన నాంపల్లి 12వ, అడిషనల్ సెషన్స్ జడ్జి టి. అనిత శుక్రవారం విచారణలో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఆయన పేర్కొన్నారు.