మన్సూరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియాఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్‌లోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహించిన కార్యక్రమా నికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై వాత్సల్య ఫౌండేషన్ అనాథ విద్యార్థులకు జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా జైపురికాలనీలోని శ్రీసాయిబాబా దేవాలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ కాలుష్యమయంగా మారుతున్న నగరాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇపుడు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని తెలిపారు. మనిషి మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలిని ఇచ్చేచెట్ల ను సమృద్ధిగా పెంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ స్టేట్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర్ రావు, కో ఆర్డినేటర్ కూర నాగరాజు, గ్రేటర్ అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ గుప్త, వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు కటకం శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్, చందా భాగ్యలక్ష్మీ, ఉప్పల స్వప్న, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.