హైదరాబాద్: నగరంలోని ప్రకాశ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్‌పై (Metro station) నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్‌కు చెందిన రాజు శనివారం రాత్రి ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ కలహాల వల్లే రాజు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.