Hyderabad | నాలుగో తరగతి విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. స్థానికుల దాడితో వ్యక్తి మృతి
Hyderabad | హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక(9)తో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది తెలిసి బాధిత బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడిపై దాడిచేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Hyderabad | హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలిక(9)తో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది తెలిసి బాధిత బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు నిందితుడిపై దాడిచేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూం బ్లాక్‌లో నివాసం ఉండే అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి నిలోఫర్ ఆస్పత్రి వద్ద టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే బ్లాక్‌లో నివాసం ఉండే నాలుగో తరగతి విద్యార్థినితో ఇటీవల అతను అనుచితంగా ప్రవర్తించాడు. మైనర్ బాలికకు ముద్దులు పెడుతూ.. ప్రైవేట్ పార్ట్స్‌ను తాకాడు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అది చూసి బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆవేశంతో నిందితుడిపై దాడికి దిగారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అజీజ్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

