కాచిగూడ, మే 18: కల్తీ కల్లు తాగి ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ చిమ్నా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి (35)కల్తీ కల్లు సేవించి శనివారం అర్ధరాత్రి ఉందానగర్ రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ప్లాట్ ఫారం-5 లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. మృతిని ఒంటిపై ఆరెంజ్, ఎరుపు గీతల చొక్కా, సిమెంట్ రంగు పాయింట్ ధరించి, ఎత్తు 5.2 కలిగి ఉన్నాడు. మృతి చెందిన వ్యక్తి విరాల కోసం 9182630468 లో సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ కోరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.