హైదరాబాద్ : సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ హత్య చోటుచేసుకుంది. హమేర్ (35) అనే వ్యక్తిపై స్థానిక యువకుడు కొబ్బరికాయలు నరికే కత్తితో అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన హమేర్ను స్థానికులు వెంటనే దవాకానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుడు హమేర్పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
ఘటనకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కాగా, మృతుడు, నిందితుడు ఇద్దరూ గంజాయి సేవించే యువకుల బృందానికి చెందినవారిగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.