ఖైరతాబాద్, సెప్టెంబర్ 27: మహాత్మాగాంధీ తర్వాత ‘బాపూజీ’గా గౌరవం పొందుతున్న మహానుభావుడు కొండా లక్ష్మణ్బాపూ జీ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురసరించుకొని ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలకు హకులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉండాలనే దృఢ సంకల్పంతో తన జీవితాంతం వివిధ ప్రజా పోరాటాల్లో పాల్గొన్న గొప్ప పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ అని మధుసూదనాచారి కొనియాడారు.
జాతీయోద్య మం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలు, బీసీల హకులు, చేనేత కార్మికుల ఉద్యమాలు వంటి అనేక పో రాటాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆశయాల కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. మలిదశ ఉద్యమంలో బాపూజీతో ఒక సంవత్సరంపాటు సన్నిహితంగా పనిచేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని సిరికొండ చెప్పారు.