మేడ్చల్ /బోడుప్పల్ / పీర్జాదిగూడ / జవహర్‌నగర్, నవంబర్ 5 : ‘కాంగ్రెస్ నమ్మి మోసపోతే..గోసపడుతాం. కరెంట్ సున్నా అవుతుంది. పథకాలు బంద్ అవుతాయి. తెలంగాణ అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లుంది. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాలతో రైతులు, గొల్ల కుర్మలు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు బాగు పడ్డారు. అభివృద్ధి చేసుకున్న తెలంగాణ కాంగ్రెసోళ్ల చేతిలోకి వెళ్తే పరిస్థితి మళ్లీ మొద టికి వస్తుంది’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌లో జరిగిన రోడ్ షో, ప్రజా ఆశీర్వాద సభలో మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలనలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంస్ పాలనలో తెలంగాణ గోస పడ్డదని, కరెంటు కోతలు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత దగ పడ్డా తెలంగాణను ధనిక రాష్ర్టంగా మార్చారన్నారు. ముప్పై ఏండ్ల నుంచి నిండని చెరువులు మండుటెండల్లో కూడా మత్తడి దుంకుతున్నాయన్నారు.
తెలంగాణ అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఐదేండ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకులు కావాలా, నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు కావాలా ప్రజలు తేల్చుకోవాలని మంత్రి సూచించారు. ఎంపీగా గెలిచిన వ్యక్తి ఒక్కసారైనా మీ ప్రాంతానిక వచ్చిండా… నయా పైసా అభివృద్ధి అయినా చేసిండా..అలాంటి పార్టీలకు ఓటు వేసి మోసపోవద్దని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు.

జవహర్‌నగర్ నా గుండెకాయ
జవహర్నగర్నాకు గుండెకాలాంటిదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగున్న రేండ్లలో అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మోజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందని, హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. జవహర్‌నగర్ 2014కు ముందు ఎట్లుంటే… ప్రస్తుతం ఎలా మారిందో ప్రజలు గమనించాలన్నారు. కార్యకర్తలు నా రెండు కండ్లలాంటి వారని కడుపులో పెట్టుకొని చూస్తాననారు.
ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం
బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌లో జరిగిన ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. రోడ్లు, వీధులు గులాబీమయం అయ్యాయి. ఆయా ప్రాంతాలు జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న అనే నినాదాలు హోరెత్తాయి.బోనాలు, డోలు వాయి ద్యాలతో మంత్రి చామకూర మల్లారెడ్డికి స్వాగతం పలికా రు.
పెద్ద ఎత్తున ప్రజలు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో జనసంద్రంగా కన్పించా యి. బోడుప్పల్లో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మూడు వేల బైక్‌లతో అంబేద్క ర్ చౌరస్తా నుంచి చెంగిచర్ల చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, జంట కార్పొరేషన్ల మేయర్ సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్‌రెడ్డి,డిప్యూటీమేయర్లు కొత్త లక్ష్మీరవిగౌడ్, కుర్రశివ కుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు రాంచంద్రారెడ్డి, బొమ్మక్ విశ్వనాథ్, రవిగౌడ్, రొక్కం నర్సింహరెడ్డి.మోతెరాజు, ఉప్పరివిజయ్, కీర్తన్‌రెడ్డి, పాండురంగ, శత్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్‌లో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ప్రజా ఆశీర్వాద సభలో కార్పొరేటర్లు, కోఆప్షన్‌సభ్యులు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ఉద్యమకారులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌చారి, బాల్‌రాజ్, మహేశ్, సిద్ధులుయాదవ్, పరశురాం, మహిళ కమిటీసభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా జవహర్‌నగర్ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో 500 మంది బీఆర్ఎస్లో చేశారు. అలాగే పీర్జాదిగూడలో పలు డివిజన్లకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలోచేశారు.