ఘట్కేసర్ రూరల్/మేడ్చల్, అక్టోబర్ 25 : ప్యాకేజీలకు అమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొర్రెములలో ఉన్న సీబీజీ కన్వెన్షన్‌లో మండల బూత్ కమిటీల సమావేశం నిర్వహి ంచారు. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ టికెట్‌తో ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించి, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే పార్టీ నాకు టికెట్ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.