హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. మాల్ మైసమ్మ ఫ్లై ఓవర్‌ను అధికారులు మూసివేశారు. దీంతో హయత్‌నగర్, దిల్సుఖ్ నగర్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతోపాటు ఆర్టీసీ బస్సులు పెద్ద సంఖ్యలో రాజధానికి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సిటీ బస్సుల కోసం ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు బస్ స్టాపుల్లో ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.