పురానాపూల్లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident | నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పునానాపూర్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్ : నగరంలోని కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలోని పురానాపూల్లోని ఓ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూసీ నదికి సమీపంలో ఉన్న ఓ భవనంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. భవనాన్ని కూలర్లు, టైర్ల గోడౌన్గా వినియోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజిన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పొగ ఆ ప్రాంతాన్ని కప్పేడం, భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

