బీఆర్ఎస్కు జై కొట్టిన మైసిరెడ్డిపల్లి
మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామం బీఆర్ఎస్కు జై కొట్టింది. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ఒక్కటే మార్గమని భావించారు. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అభివృద్ధి జరగలేదని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిషితారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు.
- మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరిక
మేడ్చల్, నవంబరు 8 : మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామం బీఆర్ఎస్కు జై కొట్టింది. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ ఒక్కటే మార్గమని భావించారు. ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అభివృద్ధి జరగలేదని గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నిషితారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరారు. మేడ్చల్‌లోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే నమ్మకమన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా చూసినా బీఆర్ఎస్సే ఉందన్నారు.
13 ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో ఉన్న మైసిరెడ్డిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూసి నిషితారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. కళ్లల్లో ఒత్తులు వేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, సొంత నిధులతో సైతం ఊరూరికి రోడ్లు వేయించానని, గుళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ నేతల మాయ మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. నిషితారెడ్డితో పాటు బుచ్చిరెడ్డి, సంజీవ, భూషణం, అనిత, శంకర్‌తో పాటు దాదాపు 150 మంది బీఆర్ఎస్లో చేశారు. అలాగే మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన యువకులు శ్రీనాథ్ ఆధ్వర్యంలో 50 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, నాయకులు రాజమల్లారెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, భాగ్యారెడ్డి, రాఘవేందర్ గౌడ్, కౌన్సిలర్లు కౌడె మహేశ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, సురేశ్ రెడ్డి, నారెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

