బడంగ్ పేట్, జూలై 12: గత పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగానే నాదర్గుల్ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. శనివారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బడంగ్పేట్ నుంచి నాదర్గుల్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.9 కోట్లు కేటాయించడంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గుర్రంగూడలో కొంత భాగం రోడ్డు, అల్మాస్గూడ రోడ్డు కాంట్రాక్టర్ కారణంగా ఆగిపోయిందన్నారు.
విద్యుత్ స్తంభాలను తొలగించడానికి కొంత నిధులు గతంలో సర్దుబాటు చేయలేకపోయామన్నారు. తాజాగా నాదర్గుల్ రోడ్డుకు సంబంధించి రూ.55 లక్షలు పోల్ సిట్టింగ్‌కు కేటాయించామన్నారు. చెట్లు, విద్యుత్ స్తం భాలను తొలగిస్తేనే రోడ్డు వేయడానికి వీలుంటుందన్నారు. ఇప్పటికే 75 చెట్లను గుర్తించామని వాటిని ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తామని తెలిపారు.
పార్టీలు ముఖ్యం కాదు ప్రజా సమస్యలే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ వెంకన్న, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, మాజీ ప్రజా ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి,కుమార్‌గౌడ్, జగన్మోహన్రెడ్డి, నరసింహారెడ్డి, జంగయ్య, మహిపాల్, శ్రీరాములు, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, పవన్‌కుమార్, రాంరెడ్డి, అర్జున్, బీఆర్ఎస్ శేఖర్‌రెడ్డి, జంగారెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.