Talasani srinivas yadav | రాష్ట్రంలో బోనాల సందడి వాతావరణం మొదలైన విషయం తెలిసిందే. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరుపుకునే జాతర బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆషాడ బోనాల జాతరకు రావాలంటూ మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆహ్వానం అందింది.
ఆగస్టు 2న నిర్వహించే మహంకాళి బోనాల జాతర, 3న జరిపే రంగంలో పాల్గొనాలని సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ అధికారులు, పండితులు వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంప్రదాయ బద్దంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
Read ALso :
Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర
Tragedy | పెళ్లయిన 15 రోజుల్లోనే విషాదం.. బైక్పై నుంచి కిందపడి నవ వధువు మృతి