అంబర్ పేట, జూలై 6 : అంబర్ పేట మహంకాళి అమ్మవారి ఘటం(Mahankali ghatam) ఊరేగింపు ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఆదివారం నుంచి బోనాలు జరిగే 20వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారి ఘటం ఒక్కొక్క బస్తీలో తిరుగుతూ ఉంటుంది. బస్తీలలో భక్తులు అమ్మవారిని స్వాగతించి పూజలు చేస్తారు. అన్ని బస్తీలు, గల్లీల్లో రోజుకు రెండు, మూడు బస్తీల చొప్పున ఘటం తిరుగుతుంది. ఘటంలో అలంకరించిన అమ్మవారిని ఎత్తుకొని బస్తీ బస్తీకి తిప్పుతారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ బి. పద్మ వెంకటరెడ్డి, దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | దారుణం.. రైలు బోగీలో మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై రైలు పట్టాలపై పడేసి..!
Korutla Murder case | ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. చిన్నమ్మ హంతకురాలు..!