Mahankali Temple | చార్మినార్, జూన్ 25 : పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం నాడు ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ నివాసంలో జరిగిన కార్యక్రమంలో అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షుడు డీఆర్ ప్రభాకర్, సలహాదారులు రాందేవ్ అగర్వాల్, కోశాధికారి ఏ సతీష్, ప్రతినిధులు ఎస్పీ క్రాంతి కుమార్, జగ్మోహన్ కపూర్, ఏం కృష్ణ, జి రాఘవేందర్, గట్టు శ్రీనివాస్, సాయికిరణ్, పి విశాల్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.