బంజారాహిల్స్,జనవరి 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ విచారణకు పిలిపించి కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ ఆరోపించారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు ముందుగా తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు సంఘీభావంగా వందలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మాగంటి సునీతా గోపీనాథ్ అక్కడికి వచ్చారు.
మాగంటి సునీతా గోపీనాథ్ మాట్లాడుతూ.. హామీలు నెరవేర్చడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో డ్రామాతో కాలయాపన చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో పాటు పలువురు నాయకులు జూబ్లీహిల్స్ పీఎస్ దాకా కేటీఆర్ వెంటవచ్చారు. పీఎస్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.