బంజారాహిల్స్, సెప్టెంబర్ 12: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకురాలు మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. శుక్రవారం యూసుఫ్‌గూడ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి మాగంటి సునీతా గోపీనాథ్ పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడిన సునీతా గోపీనాథ్.. రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఓటరు జాబితాలో పేరులేనివారిని గుర్తించి వెంటనే చేర్చేలా చూడాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాలో ఉన్న వారు అక్కడున్నారా.. లేరా అనే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అందజేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలుసని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విసిగిపోయారన్నారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.