సిటీబ్యూరో, అక్టోబరు 14 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ బుధవారం షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నది. ఈ మేరకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో కలిసి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించనున్నారు. కాగా రెండో రోజు 11 నామినేషన్లను దాఖలు చేయగా మొత్తం 22 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్,అక్టోబర్14: జూబ్లీహిల్స్‌లో మాగంటి అభిమానుల బలమే విజయానికి శ్రీకారం చుడుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. మంగళవారం యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్ ఏ బ్లాక్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, కార్పొరేటర్లు సామల హేమ, రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. సునీత గోపీనాథ్‌కు పార్టీ శ్రేణులు హారతి ఇచ్చారు.