బంజారాహిల్స్, నవంబర్ 4: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన తమ తండ్రి, దివంగత మాగంటి గోపీనాథ్ ఆశయాలను పూర్తిచేసేందుకు తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటేసి గెలిపించాలంటూ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వెంగళ్రావునగర్, రహ్మత్‌నగర్ డివిజన్ల పరిధిలో మంగళవారం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో తమ తండ్రి చేసిన అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, ఆయన చూపినబాటలోనే తమ తల్లి సునీతాగోపీనాథ్ ప్రయనిస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు పావనీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.