బంజారాహిల్స్, సెప్టెంబర్ 22: జూబ్లీహిల్స్ నియోజకవర్గంషేక్పేట డివిజన్ పరిధిలో సోమవారం దివంగత ఎమ్మెల్యే మాగంటి కుమార్తె మాగంటి అక్షర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న గోపన్న కుటుంబానికి తాము అండగా నిలుస్తామంటూ పలువురు మహిళలు భరోసా ఇచ్చారు. మాగంటి అక్షరకు అడుగడుగునా స్వాగతం పలుకుతూ దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే పెద్ద ఎత్తున వేడుకలు చేయించేవారని కన్నీటిపర్యంతం అయ్యారు.