వెంగళరావునగర్, అక్టోబర్ 25 : రాళ్లూ రప్పలు, గుంతలతో మధురానగర్ రోడ్డు నరకప్రాయంగా మారింది. నెల రోజుల క్రితం మధురానగర్ -ఈ బ్లాక్లో రోడ్డు వేసేందుకు గుత్తేదారుడు రోడ్డును తవ్వి.. నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేశారు. దీంతో రోడ్డంతా గోతులు, మట్టి, రాళ్లూ రప్పలతో నిండిపోవడంతో వాహనదారులు, కాలనీవాసులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల్ని కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధురానగర్లో పర్యటించినప్పుడు కాలనీవాసులతో సమావేశమై మధురానగర్, సిద్ధార్ధనగర్ కాలనీ, వెంగళరావునగర్ కాలనీలలో రూ1.40 కోట్లతో పనులను మంజూరు చేశారు. అయితే హడావిడిగా రోడ్డును తవ్వేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మధురానగర్ కాలనీలో ఏ సమస్య గురించైనా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి పనులు చేసేవారని.. ఇ ప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. తా మంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సు నీతకే మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.