Hyderabad | వెంగళరావునగర్, మే 3 : నగర కమిషనరేట్ పునర్ వ్వవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో రెండు సంవత్సరాల క్రితం ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధి నుంచి విడిపోయి ఏర్పడిన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధి పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధి సెక్టార్ -7లోని యూసుఫ్‌గూడ బస్తీ, ఎల్ఎన్ నగర్, నవోదయ కాలనీ, కమలాపురి కాలనీ, శాలివాహన నగర్, గ్రీన్ బావర్చీ, ప్రగతి నగర్, మారుతి నగర్, శ్రీ కృష్ణ దేవరాయ నగర్, ఎస్బీహెచ్ కాలనీ, కృష్ణ నగర్ (ఏ బ్లాక్), గణపతి కాంప్లెక్స్, కృష్ణ నగర్ లేబర్ అడ్డా ప్రాంతాలు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ పోలీస్ ఔట్ పోస్ట్ కూడా మధురానగర్ కిందకు తెచ్చారు. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇల్లు కూడా మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వచ్చింది. విస్తీర్ణం పెరగడంతో మధురానగర్ పోలీసుస్టేషన్ లో కొత్త ప్రాంతాలు కలిశాయి.
సిటీలో భారీగా పోలీసు ఇన్స్పెక్టర్లను బదిలీల్లో భాగంగా.. మధురానగర్ ఇన్ స్పెక్టర్ కూడా బదిలీ అయ్యారు. సిటీకి అదనంగా 1200 మంది సిబ్బంది కేటాయించారు. పరిధి పెంచడంతో ఈ పోలీసు స్టేషన్ సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. అటు కార్మికనగర్ లాంటి మాస్, ఇటు కమలాపురి కాలనీ, నవోదయ కాలనీ లాంటి క్లాస్ ప్రాంతాలు మిక్స్ ఆయ్యాయి. శాంతిభద్రతల కోసం పోలీసు ఉన్నతాధికారులు ఈ సంస్కరణలు చేపట్టారు.