ఎర్రగడ్డ, సెప్టెంబర్ 8: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎర్రగడ్డ డివిజన్ ఇన్చార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రగడ్డ సంషీర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ బూత్‌స్థాయి కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు గుర్తుచేస్తూ.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న విధ్వంసాన్ని వివరిస్తూ ముందుకువెళ్లాలన్నారు. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అన్ని పండుగలకు ప్రోత్సాహకాలు అందించారన్నారు.