e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ పెడచెవిన పెడితే.. ప్రమాదమే

పెడచెవిన పెడితే.. ప్రమాదమే

పెడచెవిన పెడితే.. ప్రమాదమే
  • లాక్‌డౌన్‌ నిబంధనలతో పాటు.. ట్రాఫిక్‌ రూల్స్‌ కూడా పాటించాల్సిందే
  • ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానాలు
  • సైబరాబాద్‌ పరిధిలో 6 రోజుల్లో 60వేల ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. చలాన్‌లు జారీ చేసిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు
  • లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లో 14రోడ్డు ప్రమాదాలు
  • ఇద్దరు మృతి 17మందికి గాయాలు..

సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): లాక్‌డౌన్‌ నిబంధనలే కాదు.. ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించినా కొరడా ఝళిపిస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న వేళలో, సడలింపు ఇచ్చిన సమయంలో కొంతమంది యథేచ్ఛగా ట్రాఫిక్‌ రూల్స్‌ను గాలికొదిలేసి వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు విభాగం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే గత ఆరు రోజులుగా లాక్‌డౌన్‌, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 60వేల మందికి చలానాలు జారీ చేశారు.

మాదాపూర్‌ పరిధిలో అధిక ఉల్లంఘనలు

సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘన దారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సైబరాబాద్‌ పరిధిలో సమీకృత ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ సహకారంతో పది ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల అధికారులతో కూడిన ట్రాఫిక్‌ సెల్‌ ఉల్లంఘనులను గుర్తించే పనిలో పడింది. 6 రోజులుగా అన్ని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నియమాలను పట్టించుకోకుండా తిరిగిన 60వేల మందిని గుర్తించారు. వీరిలో అత్యధికంగా మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8168 మందికి చలానాలు జారీ అయ్యాయి.

సడలింపు సమయంలో ప్రమాదాలు

లాక్‌డౌన్‌ సడలించిన వేళల్లో సైబరాబాద్‌ పరిధిలో గత 6 రోజులుగా 14 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు వాహనదారులు మరణించారు. 17 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాలన్నీ ఉదయం 6 నుంచి 10 మధ్యనే జరిగాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే క్రమంలో వేగంగా వాహనాలను నడపడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. కాగా సురక్షిత ప్రయాణానికి నగరవాసులకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు.

వాహనదారులకు పోలీసుల సూచనలు..

  • దూర ప్రాంతాలకు బైకుల మీద వెళ్ళకండి. లాక్‌డౌన్‌ సడలింపు సమయంలో ఆర్‌టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.. వాటిలో ప్రయాణించండి.
  • సడలింపు సమయం అయిపోతుందని అతివేగంగా ప్రయాణించొద్దు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారు ఆదరా గాబరా పడొద్దు.
  • కారులో పరిమితికి మించి ప్రయాణం చేయొద్దు.
  • ద్విచక్రవాహనంపై ముగ్గురితో ప్రయాణం వద్దు.
  • బ్యాగులు, ఇతర లగేజీలను బైక్‌ హ్యాండిల్‌కు తగిలించుకోకండి.
  • మద్యం సేవించి వాహనాన్ని అసలు నడిపించొద్దు.
  • సరుకులు తరలించే వాహనాల్లో ప్రయాణికులను అనుతించవద్దు.
  • ప్రధాన రహదారులు, జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆగి సెల్ఫీలు తీసుకోకండి.
  • వాహనాల్లో పెట్రోలు, డీజిల్‌ ఉండేలా చూసుకోండి.
  • ద్విచక్రవాహనాల మీద ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్‌లు ధరించాలి. కారులో సీటు బెల్టు తప్పనిసరి ధరించాలి.
  • రోడ్డు మధ్యలో వాహనాలను పార్క్‌ చేయకండి..
  • వాహనం చెడిపోయినప్పుడు ఎదుటి వారికి తెలిసే విధంగా గుర్తులు పెట్టండి.
  • చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు సహకరించండి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెడచెవిన పెడితే.. ప్రమాదమే

ట్రెండింగ్‌

Advertisement