Ameerpet Fire Accident | అమీర్ పేట్‌లోని మైత్రివనం కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని తెలిసిందే. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిప్రమాద సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి స్థానికులు కీలక విషయాలు వెల్లడించారు.
ఓ స్థానిక మహిళ మాట్లాడుతూ.. మాకు ఇలా పొగ వస్తుంది.. మంటలంటుకుంటయి అని హర్ష మెస్ హోటల్ వాళ్లకు చెప్పినం.. అయినా సరే వాళ్లు చూసి చూడనట్టు వదిలేశారు. పోలీసులకు కూడా కంప్లైయింట్ ఇచ్చినం.. అగ్నిమాపక సిబ్బంది కూడా ఎవరూ పట్టించుకోలేదు. మా సెకండ్ ఫోర్లో మంటలు మొదలయ్యాయి. మేం చూసేలోపే మంటలు చాలా ఎక్కువయ్యాయి. అది హోటల్.. మాకు సరిగా వెనుకవైపు ఉంటుంది. మేం నెలకింద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే మీకు ప్రాణనష్టమైందా..? లేకపోతే ఆస్తి నష్టమైందా..? అడిగారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నా భర్త, మా స్టాఫ్ ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చింది.
హర్ష మెస్ హోటల్, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్న మాటలతో అర్థమవుతోంది. ఓ టాయ్ షాప్ యజమాని హర్ష మెస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు వచ్చాయి. మంటలను అదుపు చేసేందుకు 20 నిమిషాలు యత్నించామని.. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్టు ఇప్పటికే తెలిపారు. గతంలో హర్ష మెస్‌పై ఫిర్యాదు చేశామని తెలియజేశారు.
పక్కన ఉన్న హోటల్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఫిర్యాదు చేసినా పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు
మైత్రివనం అగ్నిప్రమాదం గురించి కీలక విషయాలు బయట పెట్టిన స్థానికులు https://t.co/OHVAMshzLV pic.twitter.com/dQx1Bnt8G4
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026
Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’