బండ్లగూడ, డిసెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్నకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో గ్రామస్తులైన నిరుపేదలకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గండిపేట మండలం పరిధిలోని కిస్మత్పూర్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయ న పాల్గొని డబుల్ బెడ్రూం ఇండ్ల పంపకం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు గూడు కల్పించేందకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నా రు. ఈ ఇళ్ల నిర్మాణం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కిస్మత్పూర్, బైరాగిగూడలో చేపట్టారని, ప్రభుత్వ అదేశాల మేరకు ఈ ఇండ్లను స్థానికులైన అంటే.. గ్రామంలోని నిరుపేదలకు ప్రథమ ప్రాధాన్యతను కల్పింస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి గ్రామస్తుల సమక్షంలోనే లాటరీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.
అనంతరం రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ మాట్లాడు తూ.. డబుల్ బెడ్ రూంల కేటాయింపు గురించి వివరించారు. స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని, స్థానిక గ్రామస్తులై ఉండి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ల వారిగా విభజించి అర్హులైన వారి పేర్లను రికార్డు చేస్తామని తెలిపారు. వాటిని కూడా గ్రామ సభ ఏర్పాటు చేసి లాటరీ ద్వారా ఇండ్ల పంపకం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 9వ తేది నుంచి 21వ తేది వరకు కిస్మత్పూర్, బైరాగిగూడ గ్రామంలో దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు రెవెన్యూ బృందాలు వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. దరఖాస్తుదారులు అధికారులుకు సహకరించి వారు అడిగిన పత్రాలను చూపించాలని, అవినీతికి తావు లేకుండా పారదర్శంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్‌గౌడ్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, గండిపేట మండల తహసీల్ధార్ రాజశేఖర్, కార్పొరేటర్లు శ్రీలత, అస్లాంబిన్ అబ్దుల్లా, సాగర్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, నిఖీల, యువజన సంఘం అధ్యక్షడు మల్లేశ్‌యాదవ్, నాయకులు జగదీశ్, నాగరాజు, పాపయ్య యాదవ్, విష్ణు వర్ధన్‌రెడ్డి, సాయిబాబగౌడ్, రాజు, జావెద్ పాల్గొన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 7 : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డుకు చెందిన సురేష్‌చారి కుటుంబ సభ్యులకు రూ.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఎంతో మంది పేద ప్రజలకు నాణ్యమైన వైద్యమందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోట్ల రూపాయలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్‌యాదవ్, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్లతో పాటు పలువురు పాల్గొన్నారు.