శంషాబాద్ రూరల్, జనవరి 4: రైతులకు అందుబాటులో రుణాలు ఉన్నాయని మల్కారం పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీశ్ తెలిపారు. బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీశ్ మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో బంగారంపై రుణాలు ఇవ్వడంతో పాటు క్రాప్ లోన్లు ఇస్తామని చెప్పా రు. కొత్తగా క్రాప్ లోన్లు రూ.75 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో దీర్ఘకాలిక లోన్లు రూ.2 కోట్లు అందుబాటులో ఉన్నాయని, క్రాప్లోన్లలో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
రైతులు రుణాలు తీసుకొని వ్యవసాయం పనులలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రభుత్వం రుణాలు అందుబాటులో ఉంచిన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ప్రభుసాగర్, డైరక్టర్లు దర్గా సత్తయ్య, శివాజీ, బాల్రాజ్ గౌడ్, వజీత్ ఖాన్, రెడ్యా, పద్మమ్మ, సీఈవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.