శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య నాయకులతో దళిత బంధు అమలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. సమావేశంలో శంషాబాద్ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు.