సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసాయి. సోమవారం రాత్రి 9గంటల వరకు బహుదూర్పురాలోని సులేమాన్‌నగర్‌లో 1.60సెం.మీలు, రాజేంద్రనగర్‌లో 1.55సెం.మీలు, పటాన్చెరులో 1.33సెం.మీలు, గచ్చిబౌలి, ఖాజాగూడలో 1.23సెం.మీలు, అత్తాపూర్‌లో 1.20సెం.మీలు, షేక్‌పేట, బంజారాహిల్స్‌లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాగల 24గంటల్లో నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.