సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): గాలి విచ్చిన్నతి ప్రభావంతో గురువారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు వెస్ట్ మారేడ్‌పల్లి అత్యధికంగా 1.65, పికెట్‌లో 1.55, మాదాపూర్‌లో 1.48, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 1.30, కాప్రా, అడ్డగుట్టలో 1.25, బోరబండ, చర్లపల్లి, బాలానగర్‌లోని ఓల్డ్ సుల్తాన్‌నగర్‌లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. గురువారం రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.5, కనిష్ఠం 24.5 డిగ్రీలు.. గాలిలో తేమ 72 శాతంగా నమోదైనట్లు తెలిపారు.