సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నగరంలో శుక్రవారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురవగా, శివారు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అత్యధికంగా 8.1 సెం.మీ, బార్కాస్ 1.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్ఠం 33.2, కనిష్ఠం 26.1, గాలిలో తేమ 64 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.