BRS Candidate Padmarao | కేంద్ర మంత్రిని ఓడించి చరిత్ర సృష్టిద్దాం : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు
BRS Candidate Padmarao | పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ (BRS Candidate Padmarao) పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి (Minister Kishan Reddy) ని ఓడించి చరిత్రను తిరగరాయాలని కోరారు.
గత శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్కు చెందిన అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన ఊపులోనే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నాయకత్వంలో అన్ని నియోజవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారని వెల్లడించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మరింత కష్టపడతామని అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాట్లాడుతూ అనేక హామీలిచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. కరెంట్, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపై వస్తున్న తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్ధని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

