RS Praveen Kumar | గురుకులాల్లో(Gurukulala tenders) అవినీతిపై చర్చకు సిద్ధమని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్ బయలు దేరిన హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిసిందే. గంటన్నర పైగా డీసీఎం వ్యాన్‌లో తిప్పిన పోలీసులు చివరకు మాజీ మంత్రి హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులను కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించి బయట ఎండలో కూర్చోబెట్టారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మేమంతా కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాం. మీరు కూడా మాకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. మీరు గన్ పార్క్ దగ్గర ఉట్టి చేతులతో కూర్చొని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే మేమంతా ఇక్కడే ఉన్నాం.. ఆ ఆధారాలను తీసుకొని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు రండి. మేమెక్కడికి పోం. మీలాగా పిరికిపందలం కాదు.. దొడ్డిదారిన పోయేటోళ్లం కాదు. పోలీసోళ్లను అడ్డం పెట్టి డ్రామాలాడాల్సిన అవసరం లేదన్నారు.
మేం పోలీస్ కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వాహనాల్లో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర అందరిముందు డిబేట్ చేద్దామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . లేదా తెలంగాణను దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి పోలీసోళ్లకు చెప్పండి మమ్మల్ని వాహనాల్లో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లమని చెప్పండి. ఎలాంటి దుర్భాషలు కాని, ఎలాంటి అప్రజాస్వామికమైన భాష కానీ మేం మాట్లాడమన్నారు.
చర్చపై మంత్రులు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కి రండి
లేదా మమ్మల్ని గన్ పార్కు వద్దకు రానివ్వండి
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/w6Y2TmuunC pic.twitter.com/42veiUMari
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026
గంటన్నర పైగా డీసీఎం వ్యాన్‌లో తిప్పి, చివరకు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నాయకులను కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు తరలించి బయట ఎండలో కూర్చోబెట్టిన పోలీసులు https://t.co/QbjYQ3DZyy pic.twitter.com/MObWP6jVxF
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026