కాప్రా, అక్టోబర్ 28: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కాప్రా డివిజన్ నిర్మలానగర్, కందిగూడ, వలువర్నగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేసి, బీఆర్ఎస్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మహిళా కార్యకర్తలు గృహిణులను పలుకరిస్తూ వారికి బొట్టుపెట్టి కరపత్రాలను అందజేసి.. లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటు వేయాలి..
మల్లాపూర్, అక్టోబర్ 28: రాష్ట్రంలో అభివృద్ధి జరగా లంటే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం డివిజన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీ, న్యూ భవానీనగర్ కాలనీల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇంటింటా ప్రచారం ముమ్మరం..
రామంతాపూర్, అక్టోబర్ 28 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం శనివారం రామంతాపూర్ డివిజన్లోని సత్యానగర్, తదితర ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ , అభివృద్ధి కరపత్రాలను ఇం టింటా పంచు తూ ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు, సర్వబాబుయాదవ్, ఆనంద్‌యాదవ్, తునికి సంధ్యారాణి. మధుసూదన్‌రెడ్డి, ముస్తాక్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బాలాజీనగర్‌లో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బుర్ర మహేందర్, పలువురు కార్యకర్తలు బండారి గెలుపుకోసం ఇంటింటా ప్రచారం చేశారు.
గులాబీ కండువా కప్పుకున్న యువకులు
అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం రామంతాపూర్ డివిజన్ చికెన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వరుణ్‌యాదవ్, సుమన్, వెంకట్, హేమంత్‌యాదవ్ నరేశ్యాదవ్లు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి బండారి లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వబాబు యాదవ్, పాలకూర శ్రీకాంత్‌గౌడ్, నరేశ్, బోసాని పవన్‌కుమార్, సూరంశంకర్ పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపిస్తాం…
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. శనివారం బ్యాంక్‌కాలనీ, ప్రశాంత్‌నగర్, జహీద్నగర్, రాఘవేంద్రనగర్, కల్యాణపురి తదితర ప్రాంతాల్లో ఇంటింటా విస్తృతం ప్రచారం నిర్వహించారు.
– నాచారం డివిజన్లో కార్పొరేటర్ శాంతిసాయిజెన్శేఖర్ ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. బండారికి ఓటు వేయమని వృద్ధులకు నమస్కరిస్తూ ఆశీస్సులు తీసుకున్నారు.