Legal Exhibition | హైదరాబాద్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి న్యాయ విద్య ఎంతో ముఖ్యమని, చట్టాలపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి అక్కపెద్ది తెలిపారు. కేశవ మెమోరియల్ లా కాలేజీ విద్యార్థులు తమ చేతుల్లోకి పట్టాలు రాకముందే.. చట్టాలపై అవగాహన తెచ్చుకోవడం అభినందించదగ్గ, సంతోషించదగ్గ విషయమని డాక్టర్ వాణి పేర్కొన్నారు.
నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లా కాలేజీ ప్రాంగణంలో లీగల్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా కేశవ మెమోరియల్ లా కాలేజీ ఆధ్వర్యంలో కొన్ని సీరిస్ ఆప్ ప్రోగ్రామ్స్‌ను ఆర్గనైజ్ చేశాం. ఈ క్రమంలోనే ఇవాళ లీగల్ ఎగ్జిబిషన్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవి దేవి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆయా లా కాలేజీల విద్యార్థులతో పాటు ఇతరులు కూడా ఎగ్జిబిషన్‌ను సందర్శించొచ్చు. న్యాయ కళాశాలల చరిత్రలోనే ఇది మొట్టమొదటి లీగల్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. వచ్చే నెలలో లా సెమినార్ నిర్వహించబోతున్నాం. ఈ లీగల్ ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం మా విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా నెల రోజుల పాటు కష్టపడి వినూత్న ఆలోచనలతో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. లా గ్రాడ్యుయేట్ల చేతుల్లోకి పట్టాలు రాకముందే చట్టాలపై అవగాహన తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయం. సంతోషించదగ్గ విషయం. ఈ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులతో పాటు నాతో సహా ఫ్యాకల్టీ కూడా ఎంతో కృషి చేశారు. వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు. లీగల్ ఎగ్జిబిషన్ నిర్వహణ విషయంలో కేశవ మెమోరియల్ కాలేజీ మేనేజ్మెంట్ ప్రోత్సాహం ఎంతో ఉందని డాక్టర్ వాణి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
SCR | అయ్యప్ప భక్తుల కోసం.. ఈ నెల 17 నుంచి ఎస్సీఆర్ 26 ప్రత్యేక రైళ్లు
High Blood Pressure | చలికాలంలో హైబీపీ ఉన్నవారు జాగ్రత్త.. బీపీని ఇలా కంట్రోల్ చేయండి..!