ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెసర్ ఎం. కుమార్‌ను వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పరిశోధక విద్యార్థులు కలిసి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంవత్సర కాలంగా వర్సిటీ ఖ్యాతిని పెంపొందించేందుకు విశేష కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్, టీఎస్‌పీజేఏసీ, భీమ్ ఆర్మీ విద్యార్థి విభాగం, ఎస్ఎస్ఎఫ్, తదితర సంఘాల నాయకులు కొమ్ము శేఖర్, వలిగొండ నరసింహ, తీగల శివ, పల్లపు చందు, కాంతి ప్రణయ్‌కుమార్, వేదాంత్ మౌర్య, మంద రాజు, పోతురాజు రాము, పల్లె అర్జున్, రవీందర్, అజయ్, నిశాంత్, ప్రమోద్, అఖిల్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.