రామంతాపూర్, నవంబర్ 22 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర నేత రాగిడి లక్ష్మారెడ్డి, నాయకులు బుధవారం లక్ష్మీనారాయణ కాలనీ,ఇండిస్ట్రీయల్ ఏరియాలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు పోవాలంటే మరోసారి కేసీఆర్ ము ఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కు ఓ టువేసి గెలిపించాలన్నారు. ఈసందర్భంగా ఇండ స్ట్రియ ల్ అసోసియేషన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ , బి. సురేశ్‌ల ను ఆయన కలిసి ప్రభుత్వం రూపొందించిన ఇండస్ట్రియ ల్ పాలసీ వల్ల పారిశ్రామిక వేత్తలకు ఎంతో అనుకూ ల మైందని వివరించారు. 24 గంటల కరెంటు ఇస్తుంందన్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో..
రామంతాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో బుధవారం బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలిస్తే ఉప్పల్ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మాజీ కార్పొరేటర్ గం ధం జ్యోత్స్న నాగేశ్వర్రావు ఓటర్లకు వివరించారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
నాచారం డివిజన్లో..
బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి ఓటు వే యాలని కోరుతూ నాచారం కార్పొరేటర్ శాంతి సా యిజెన్ శేఖర్ బుధవారం ప్రచారం చేశారు. కారుగుర్తుకు ఓటు వేయడం ద్వారా ఉప్పల్ అభివృద్ధిలో ముందుం టుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..
చర్లపల్లి, నవంబర్ 22 : సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని భరత్‌నగర్, రెడ్డి కాలనీ, కుషాయిగూడ, తదితర ప్రాంతాల్లో ఆమె.. ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉప్ప ల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉప్పల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు ఇంటింటి ప్రచారంను ముమ్మరం చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, పండాల శివకుమార్‌గౌడ్, కనకరాజుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సానెం రాజుగౌడ్, కోల నరేశ్, కొమ్ము రమే శ్, రెడ్డినాయక్, గిరిబాబు, కొమ్ము సురేశ్, ఆనంద్రాజుగౌడ్, ధనుంజయ్యగౌడ్, నయీం, ఎంకిరాల నర్సింహా, బాల్‌రాజు, సోమయ్య, ముత్యాలు, వెంకట్‌రెడ్డి, బొంత రాజు, వెంకటేశ్, నజీర్, సయ్యద్ అలీ, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలిత, కాలనీవాసులు పాల్గొన్నారు.
మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్లో ..
మల్లాపూర్, నవంబర్ 22 : ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం డివిజన్లోని ఇందిరానగర్ ఫేజ్-1 కాలనీలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కర పత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అ భ్యర్థించారు. కాలనీ నాయకులు మాడిశెట్టి సుదర్శన్ గురుస్వామి, దుర్గారెడ్డి, శివరాజ్, జంపాల్రెడ్డి, నవీన్‌గౌడ్, రమేశ్, కిషోర్, గణేశ్, సంతోశ్, కుమార్, మహేశ్, వంశీ, భరత్, సందీప్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్లో..
ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బ్యాంక్‌కాలనీ, చండియానగర్, లింగమయ్యనగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య ర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వే యాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
బండారికి మద్దతుగా ప్రచారం..
కాప్రా, నవంబర్ 22 : కాప్రా డివిజన్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఓల్డ్కాప్రా, సాయిబాబానగర్, సాయిరాంనగర్, నేతాజీనగర్, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, నిర్మల్‌నగర్, సైనిక్‌పురి, తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ బూత్‌కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే చేపట్టబోయే వినూత్న కార్యక్రమాలపై వారు ఓటర్లకు అవగాహన కలిగిస్తూ కరపత్రాలను పం పిణీ చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.