ఎల్బీనగర్, మే 10: పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్, సచిన్ యాదవ్‌లకు నివాళిగా శనివారం రాత్రి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కు నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాల్గొని వీర జవాన్లకు ఘన నివాళులర్పించా రు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధభూమిలో ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కుటుంబా నికి పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు.
పాకిస్థాన్ చేస్తున్న కుటిల యుద్ధనీతి విఫలమవుతున్నదన్నారు. మన త్రివిధ దళాలు దేశ భద్రతను కాపాడడంలో అపారమైన ధైర్యంతో ముందుంటున్నాయని అన్నారు. గత 50 సంవత్సరాల్లో పాకిస్థాన్ మద్దతుతో పనిచేసిన ఉగ్రవాదులు వేలాది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని అన్నారు. కానీ ప్రస్తుతం దేశ నాయకత్వం మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో, మన దళాలు మరింత బలంగా స్పందిస్తున్నాయని అన్నారు. దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఒకే మాట మీద ఉండ టం గర్వకారణమని, మనమందరం త్రివిధ దళాలకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని అన్నా రు.
టర్కీ లాంటి కొన్ని దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, మన దేశం వారి కుటిల నైతికతకు గట్టి బుద్ధి చెబుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రతి పౌరుడికి సరిహద్దుల్లో యుద్ధం చేసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ మన సైనికులకు అండ గా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. దేశ రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న 20 కోట్ల మంది టాక్స్ పే యర్స్ తమ వంతుగా విరాళాలు అందించాలని కో రారు. తమ బాధ్యతగా రూ. 3 లక్షల విరాళాన్ని ఇండియన్ ఆర్మీకి అందిస్తున్నామని, ఈ చెక్కును 2-3 రోజుల్లో పంపించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర ప్రసాద్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తిలక్ రావు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, యువత, తదితరులు పాల్గొన్నారు.