ట్రాఫిక్ చిక్కులు లేకుండా..
ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు ఇరువైపులా సర్వీస్‌రోడ్డుపై, సీఎం రోడ్డులో ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు కృషిచేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
- ప్రత్యామ్నాయ ఏర్పాటుకు కృషి : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, జూలై 8 : ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌కు ఇరువైపులా సర్వీస్‌రోడ్డుపై, సీఎం రోడ్డులో ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు కృషిచేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం ఎల్బీనగర్లోని లక్ష్మీనారాయణ భవన్లో లింగోజిగూడ డివిజన్ కాలనీవాసులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు ప్రత్యామ్నాయాలను చూస్తామన్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ డీ మార్టు రోడ్డులో వన్‌వే ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. సర్వీస్‌రోడ్డులో లారీల అడ్డా సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తామని, సీఎం రోడ్డులో వారాంతపు సంతను ప్రభుత్వ ఆస్పత్రి వెనుక భాగంలో ఏర్పాటు చేయించి ప్రధాన రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
ఎల్బీనగర్ నాగోలు మార్గంలో మజీద్ వీధిలో కొంత భాగం ఫుట్‌పాత్‌ను తొలగిస్తే ప్రయాణం సాఫీగా సాగుతుందన్నారు. కాలనీలో లో ఓల్టేజీ సమస్యలను తొలగిస్తామని, నూతన కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, నూతన కరెంటు పోల్స్‌తో పాటు నూతనంగా బీటీ, సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, నూతన సీవరేజీ లైన్లు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా కాలనీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలును విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వర ప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఆడాల రమేశ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రావణ్‌కుమార్, తిలక్‌రావు, జగన్నాథ్‌రెడ్డి, నర్సింహ గుప్తా, భాస్కర్, రాకేశ్ ఠాకూర్, లక్ష్మీప్రసన్న, మెట్రో రైలు ఎస్ఈ సాయప్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నర్సింగ్‌రావు, నాగమల్లు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
కాలనీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు చేయూత
మన్సూరాబాద్, జూలై 8: ప్రజల సౌకర్యార్థం కాలనీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు చేయూతనిస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సరస్వతినగర్, శ్రీరామ్నగర్కాలనీల్లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను శనివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలను కాలనీల్లో నిర్వహించుకునే విధంగా కమ్యూనిటీ హాళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. శ్రీరామ్నగర్కాలనీలో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. శ్రీరామ్‌నగర్‌కాలనీ సమీపంలో ఉన్న పెద్దచెరువును మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. గ్రీన్లీవ్స్ స్వచ్ఛంద సంస్థ పెద్దచెరువును దత్తత తీసుకుందని.. వారి సహకారంతో చెరువు రూపు రేఖలను మారుస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి మాట్లాడుతూ..
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సహకారంతో మన్సూరాబాద్ డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. శ్రీరామ్నగర్కాలనీలో యూఎల్సీ సమస్యను పరిష్కరించినందుకు ఎమ్మెల్యేకు కాలనీ అధ్యక్షుడు ఎం.నర్సింహారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌నగర్‌కాలనీ అధ్యక్షుడు మొద్దు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు కడియం రాంచంద్రయ్య, మూల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి లెక్కల సురేందర్‌రెడ్డి, కోశాధికారి మల్లం రాజయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు బత్తుల జలంధర్‌రెడ్డి, దేవరపల్లి వెంకట్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు బొడ్డు దామోదర్‌రెడ్డి, దేప నర్సిరెడ్డి, కార్యదర్శి నాయిని నరేందర్‌రెడ్డి, సరస్వతినగర్కాలనీ అధ్యక్షుడు పటోళ్ల కమల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి వి.రంగారెడ్డి, కోశాధికారి వి.ప్రదీప్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు మహ్మద్ మక్సూద్‌అలీ, చందునాయక్, సీహెచ్. సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, కె.మురళిగౌడ్, నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్నకురుమ, అత్తాపురం రాంచంద్రారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, రామాచారి, సిద్దగోని నర్సింహాగౌడ్, శశిధర్నేత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

