అటు నాగోల్ వైపు, ఇటు బైరమాల్గూడ్ వైపు అండర్‌పాస్‌లు, అక్కడే ఫ్లైఓవర్ నిర్మాణంతో విపరీతంగాట్రాఫిక్ రద్దీ తగ్గిపోయిన ఎల్బీనగర్ చౌరస్తా మరికొద్ది రోజుల్లో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానున్నది. విజయవాడ నుంచి నగరంలోకి సాఫీగా వచ్చేందుకు వీలుగా మెట్రో స్టేషన్ వద్ద దిగేలా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పూర్తయింది. మరికొద్ది
రోజుల్లోనే ఇది అందుబాటులోకి రానున్నది. దీంతో ఎల్బీనగర్ జంక్షన్ ఇక సిగ్నల్‌ఫ్రీ కానున్నది.
తెలంగాణ రాక మునుపు గంటల కొద్దీ ట్రాఫిక్ చిక్కులకు నిలయంగా ఉన్న ఈ జంక్షన్ ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్నది. నలువైపులా వాహనాలు ఆగకుండా సాగిపోతున్నాయి.