కవాడిగూడ, జూన్ 20: న్యాయవాదులుగా తమ పేర్లు ఎన్రోల్ చేసుకున్న న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాస్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 2019 తర్వాత ఎన్రోల్ చేసుకున్న న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. నిరసనలో ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, బార్‌కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు, సీహెచ్. శైలజ, పాశం సుజాత, కిరణ్‌కుమార్, పొన్నాల అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.