ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జెనెటిక్స్ విభాగంలో ‘డీబీటీ – బిల్డర్’ ప్రైమరీ సెల్ కల్చర్ ల్యాబ్‌ను(Culture Lab) అధికారులు సోమవారం ప్రారంభించారు. కేంద్రప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ పథకమైన బూస్ట్ టు యూనివర్సిటీ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (డీబీటీ – బిల్డర్)కింద ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీని కింద ఓయూకు అయిదేళ్లకు గాను ఒక ప్రాజెక్టుకు రూ.8.03 కోట్లు మంజూరయ్యాయి.
ఈ ప్రాజెక్టుకు కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ స్మిత సి. పవార్, కోకోఆర్డినేటర్లుగా ప్రొఫెసర్ జితేందర్ నాయక్, ప్రొఫెసర్ కరుణ రూపాల వ్యవహరించనుండగా, మొత్తం వివిధ విభాగాలకు చెందిన 18 మంది అధ్యాపకులు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లుగా పనిచేయనున్నారు. ల్యాబ్‌లో అధునాతన పరికరాలను సమకూర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.