ఉప్పల్ , మార్చి 21: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రోటోకాల్ రగడకు దారితీసింది, హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్విటేషన్ కార్డులో ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
ఓ వైపు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం.. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడు శిలాఫలకంపై హడావుడిగా ఎమ్మెల్యే పేరును స్టిక్కర్‌తో అంటించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయడం కొసమెరుపు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావడం, స్థానిక కాంగ్రెస్ నేతలు అక్కడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.