Kodangal | వికారాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో లగచర్ల గిరిజన రైతుల్లో అభిమానం ఉప్పొంగింది. దారి పొడవునా ఆటపాటలు, హారతులిచ్చి వారి సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. లగచర్ల రైతులకు మొ దటి నుంచి అండగా నిలిచిన కేటీఆర్.. సోమవారం హకీంపేటకు వస్తున్నాడని తెలిసి లగచర్ల, హకీంపేట, రోటిబండతండా, పోలేపల్లి రైతులు ఉదయం నుంచే ఆయన కోసం ఎదురు చూశారు.
మాజీ మంత్రి కేటీఆర్ కోస్గి బహిరంగకు వెళ్తూ తుంకిమెట్ల వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం హకీంపేట వద్ద లగచర్ల రైతులను కలుసుకున్నారు. లగచర్ల ఘటనలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తన భర్త ను విడిపించుకునేందుకు ఢిల్లీ వరకు వెళ్లి న్యా య పోరాటం చేసిన నిండు గర్భిణి జ్యోతి విజ్ఞ ప్తి మేరకు కేటీఆర్ ఆమె బిడ్డకు భూమిగా నామకరణం చేశారు. కొడంగల్ సెగ్మెంట్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకతో శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. గులాబీ శ్రేణులు భారీగా తరలివ చ్చారు. తుంకిమెట్ల నుంచి హకీంపేట వరకు ఎక్కడా చూసిన గులాబీమయంగా మారిపోయింది.
కొడంగల్ నుంచి పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీ ప్రకారం కేటీఆర్ సెగ్మెంట్ అభ్యున్నతికి భారీగా నిధులిచ్చి రూపురేఖలను మార్చివేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన కేటీఆర్ ఏడాది తర్వాత కొడంగల్‌కు రావడంతో సీఎం సీఎం అంటూ రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు.