అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్‌లు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్ స్కామ్‌ల గురించి మాట్లాడితే సీబీఐ అంటున్నారని తెలిపారు. అబద్ధపు హామీలిచ్చిన రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టాలని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పాలించిన నాటి నుంచి జరిగిన అవినీతిని బయటపెట్టాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలపై విచారణ జరిపించాలని అన్నారు. పేద ప్రజలకు రూ.4వేల పింఛన్ డబుల్ బెడ్రూం, కల్యాణలక్ష్మీ అడిగామని తెలిపారు. హామీలు అమలు చేయనుందుకు సీబీసీఐడీ కేసులు పెట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలు ఇచ్చిమాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై హౌస్ కమిటీ వేయాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ రావాల్సిందేనని స్పష్టం చేశారు.